![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -25 లో..... శంకర్ లేడన్న బాధలో కుటుంబం ఉంటుంది. నా తమ్ముడిని చంపేశారు అని శాంతి అనగానే అందరు షాక్ అవుతారు. అవును నా తమ్ముడు చనిపోవడానికి కారణం మీరే.. ముఖ్యంగా ఆ నందు.. నా తమ్ముడు తన కూతురిని నా కొడుకుకి ఇచ్చి పెళ్లి చెయ్యడానికి కొండంత ఆశతో వచ్చాడు కానీ తన గొంతెమ్మ కోరికలు వాడిని చంపాయి.. ఉన్న డబ్బు, తోట దానికే ఇస్తే మిగతా కూతుళ్ల పరిస్థితి ఏంటని వాడు గుండెపగిలి చచ్చాడని శాంతి అంటుంది.
అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ సైలెంట్ గా ఉండమని మురళి అంటున్నా కూడా శాంతి వినకపోవడంతో అత్త అని జానూ గట్టిగా అరుస్తుంది. ఇంకొకమాట మాట్లాడిన అత్తవి అన్న విషయం మర్చిపోతానని జాను కోప్పడుతుంది. అంటే ఏం చేస్తావే అని శాంతి అంటుంది. వదిన మా బాధలో మేం ఉంటే నువ్వు ఏంటి అని శారద కోప్పడుతుంది. నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళవే.. జరిగింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటని పెద్దావిడ కోప్పడుతుంది. మురళి మీ అమ్మని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళమని మురళితో పెద్దావిడ చెప్తుంది. దాంతో మురళి వాళ్ళ అమ్మని అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు. నువ్వు అత్త మాటలు ఏం పట్టించుకోకని నందుతో జానూ అంటుంది.
ఆ తర్వాత జానూ ఒంటరిగా బయట చెరువు దగ్గర ఉంటుంది. అక్కడ తన నాన్న ఆత్మ రూపంలో వచ్చి కుటుంబం బాధ్యతలు.. నువ్వు తీసుకుంటానని మాటివ్వమని అంటాడు. జానూ మాటిస్తుంది. దాంతో శంకర్ అక్కడ నుంచి మాయం అవుతాడు. నాన్న అంటూ జానూ చెరువు లోపలికి వెళ్తుంటే సూర్య వచ్చి ఆపుతాడు. అయినా వినకుండా లోపలికి వెళ్ళబోతుంటే జానూ చెంపపై సూర్య కొడతాడు. ఏం చేస్తున్నావంటూ జానుని వెనక్కి తీసుకొని వస్తాడు సూర్య. ఇంటికి తీసుకొని వచ్చాక ఇప్పుడు నీ కుటుంబానికి నువ్వే ధైర్యం.. నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలని సూర్య మోటివేట్ చేస్తాడు. జానూ లోపలికి వెళ్తుంది. తరువాయి భాగంలో సూర్య చేసిన మోటివేషన్ కి జానూ మారిపోయి ప్రొద్దున లేచి అందరికి దైర్యం చెప్తూ భోజనం తినిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |